నవతెలంగాణ - వీణవంక
ఈనెల 21న గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ తెలిపారు మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం మహంకాళి కోంరయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని, ఏదో మొక్కుబడిగా వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుందని ఇది సరైంది కాదని, వెంటనే కార్మికులందరికీ రూ.19 వేలు కనీస వేతనం చెల్లించాలని, పిఆర్సి వర్తింప చేసే విధంగా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని సవరించి కేటగిర్లవారిగనే పనులు చేయించాలని, 500 జనాభా తో నిమిత్తం లేకుండా పని చేసే ప్రతి కార్మికుడికి కనీస వేతనం చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులందరి నీ ఐక్యం చేసి, దశలవారీగా ఆందోళన పోరాటాలు చేసేందుకు ఈ సదస్సు సీఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యునియన్ జిల్లా కమిటీ సభ్యులు కండేసదయ్య, కదం కిషన్రావ్, మండల కార్యదర్శి మిట్టపల్లి సదానందం, కమిటీ సభ్యులు దాసరపు శంకర్, మల్లయ్య, లచ్చయ్య, చంద్రయ్య, కొంరయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:24PM