నవతెలంగాణ - చివ్వేంల: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో శనివారం మండల కేంద్రంలోని వట్టి ఖమ్మం పహాడ్ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్ పంచి పెట్టారు. అనంతరం వీరన్న నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ కార్యకర్తలలో మరింత ఉత్సాహం నింపిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో మతోన్మాద విధానాలను అనుసరిస్తూ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా అమ్మి వేస్తూ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందన్నారు. దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి చార్జీలు పెంచి మోయలేని భారం మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎల్కపల్లి వెంకన్న , ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు లాలూ నాయక్, వీరబోయిన సైదులు యాదవ్,గోగుల శ్రీను, ధరావత్ పాండు నాయక్, వీరబోయిన మహేష్, శ్రీను, నాగు, కోటేష్,సోమాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు.