నవతెలంగాణ - డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన లింగపురం గంగారాం , లావణ్య ల మొదటి కూతురు నితీష గురుకుల పాఠశాల కంజర్లలో పదో తరగతి పరీక్షల్లో 9.7 ఉత్తీర్ణత సాధించినందుకు సర్పంచ్ నోముల విజయలక్ష్మి లక్ష్మారెడ్డి ఆదివారం నితీష ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నితీష ఉన్నత చదువులు చదివి ఐఎఎస్ కావాలని, దానికోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో తీగల అశోక్, లోకం కన్నయ, అసది రంజిత్, తీగల రాజు, విలేకర్ గంగాధర్, తలారి సాయిలు,మన్నే లక్ష్మన్, తీగల గంగ శరత్, గుండ సుకేష్ తల్లి తండ్రులు లింగాపురం గంగారాం, లావణ్య దంపతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 04:09PM