నవతెలంగాణ - కంటేశ్వర్
తన తండ్రి కీ.శే. బిగాల కృష్ణ మూర్తి సంకల్పంతో మాక్లూర్ గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం గత కొన్ని రోజులుగా నిర్మించే పనులను చేపట్టి ప్రస్తుతం నిర్మించడం పూర్తి కాబోయే స్థితికి వచ్చింది. ఎట్టి పరిస్థితులలో తన తండ్రి వివాల కృష్ణమూర్తి ఆశయాన్ని నెరవేర్చాలని సంకల్పంతో అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా సైతం మాక్లుర్ గ్రామ ప్రజల కోసం దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మొత్తం పూర్తికాగా కలర్ పప్పనులు జరుగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 24 న శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతిస్వామి దివ్య శుభాషిషులతో, దివ్యకరములచే నిర్వహింపబడును అని నిజామాబాద్ అరబ్బడ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా తెలియజేశారు. కావున తప్పక విచ్చేసి స్వామి వారి ఆశిషులు స్వీకరించగలరు అని ప్రజలను కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 04:10PM