Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ఆపదలో ఉన్న వారికి, ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా మొదటగా గుర్తుకు వచ్చేది యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జర్పుల బాలు. ఇతను వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలుకు మొదటి నుంచి సేవా కార్యక్రమా లపై ఆసక్తి ఎక్కువే. బాలు పని చేసే పాఠశాలలో సిలబ స్లో లేని ఎన్నో యాక్టివిటీస్ పిల్లలతో చేయిస్తుం టారు. స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దుతారు. కొవిడ్ టైంలో పేషం ట్లకు కావల్సిన మందులు, హాస్పిటల్లో బెడ్స్, ఆక్సిజన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో అవసరం ఉన్న వారికి రక్తదాతలను ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పటి వరకు 15 వేల మందికి రక్తదానం చేయించారు. పేద విద్యార్థులకు ఇతర ఎన్జీవోల సహకారంతో ల్యాప్ ట్యాప్లు, బుక్స్, మెటీరియల్స్ ఎరెంజ్ చేస్తుంటారు. నిరుపేదలకు ఆర్థిక సాయం చేయిస్తారు. బాలు జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. జాతీయ, అంత ర్జాతీయ స్థా యిలో పలు ప్రశంసా పత్రాలను అందుకు న్నారు. ఎన్నో స త్కారాలు పొందారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాద్యాయు డిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు బెస్ట్ సోషల్ సర్వీస్ చేసే వారికి బాలు తన ఫౌండేషన్ తరపున అవార్డులు ఇస్తుండటం విశేషం. వీరి ఫౌండేషన్ వార్షికోత్సవం సంద ర్భంగా గతేడాది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లలో బెస్ట్ సోషల్ సర్వీస్ చేసే వారికి ఘన సన్మానం చేశారు. వీరి సేవలను సోనుసూద్ మెచ్చుకున్నారు. ఇంటికొక రక్త దాతను తయారు చేయడ మే లక్ష్యంగా చేసుకుని సర్వీస్ చేస్తున్నారు. రక్త దానం, సంబంధిత సహాయ చర్యల కోసం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ 97051 93913ను సంప్రదించగలరు.