Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నందికంటి శ్రీధర్
నవతెలంగాణ-నేరేడ్ మెట్
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భతి ఇస్తామని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ హామినిచ్చారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ లో నిర్వహించిన హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమ్మరి బస్తి, హరిజన బస్తీ , తెనుగు బస్తీ, కటిక బస్తీలలో ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తు న్నాయని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లలో ఉన్న సమస్యలు పరిష్కరిం చక పోతే కాంగ్రెస్ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హమీ నిచ్చారు. గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకే ఇస్తా మని మాట ఇచ్చారు. యువకులకు ఉద్యోగ భద్రత ఉంటుం దని,నిరుద్యోగ భతి కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రశేఖర్, డోలి రమేష్, సీఎం యాదగిరి, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు పవన్, శ్రీనివాస్, సూర్య ప్రకాష్ రెడ్డి, సంజీవ్ కుమార్, రవీందర్ రెడ్డి, బలరాం, రాజు పాతాలు తదితరులు పాల్గొన్నారు.