Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచన మేరకు, మూసాపేట్ డివిజన్ అవంతి నగర్ తోట ఖార్డ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను శ్రావణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను కొని యాడా రు. కూకట్ పల్లి నియోజకవర్గం లో దాదాపు ప్రతీ డివిజన్లో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమన్, మంజుల, మోహన్ రెడ్డి, సత్యం, ఉదరు, ప్రాజెక్టు ఆఫీసర్ ప్రభాకర్, మురళి, తిరుపతి, తుకారాం, జైరాజ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.