Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్ర మాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాఘవేందర్ నగర్ కాలనీలోని రూ.51. 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సవర్కర్ నగర్లో రూ.17 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సవర్కర్ నగర్ స్ట్రీట్ నెంబర్ వన్ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు రూ.14.60 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, బాబా నగర్లో రూ.11.30 లక్షల వ్యయంతో 600 ఎమ్ఎమ్, ఆర్సీసీ పైప్ లైన్ నిర్మాణ పనులకు శ్రీకా రం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అభివద్ధి లక్ష్యంగా నాచారం డివిజన్లో సుమారు కోటి రూపాయల అభివద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం జీహెచ్ఎంసి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ అధికారులు ఈఈ హరిలాల్, డీ రూప, ఏఈ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజరు కుమార్, నాచారం ఇన్స్పెక్టర్ నందీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, ముత్యం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి, తుంగ తిరుపతి, యాదగిరి, సత్యనారాయణ, విఠల్ యాదవ్, కట్ట బుచ్చి గౌడ్, కరుణాకర్, బాలమణి, కామేశ్వరి, సుజాతా దేవి, అశోక్, రఫిక్, మహేష్, నర్సింగరావు పాల్గొన్నారు.