Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ సమితి అధ్యక్షులు ఎండీ యూసుఫ్
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
మహిళా రెజ్లర్ల నిరసన, అదానీ వ్యవహారం, సైనికుల మరణాల గురించి మాట్లాడని ప్రధాని మోడీ.. కేరళ ఫైల్స్ గురించి మాట్లాడడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ సమితి అధ్యక్షులు ఎండీ యూసుఫ్ అన్నారు. బీజేపీకి హఠావో దేశ్ కో బచావో అనే నినాదంతో సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి ఇంటింటికి సీపీఐ పాదయాత్ర షాపూర్‌నగర్, మార్కెట్, కళావతి నగర్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూసుఫ్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు తమ సమస్య లను వివిధ రూపాలలో చెబుతుంటే పట్టించుకోని మోడీ, ఎన్నికలలో గెలవడానికి మాత్రం మతం గురించి మాట్లాడుతారన్నారు. ఒక ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తి ప్రజల మధ్య సఖ్యత పెంచల్సింది పోయి విద్వేషం కలిగించే అంశాలను ఎన్నికల లబ్ది కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అన్నారు. సైనికుల మతి పై వ్యక్తమైన అభిప్రాయాలను మాట్లాడని మోడీ నేడు కేరళ స్టోరీ గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పెరు గుతున్న ధరలు నిరుద్యోగంతో ప్రజలు బాధపడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల్లో మతం వాడుకోవడంలో ఇప్పటివరకు పనిచేసిన ప్రధానుల్లో మోడీ ప్రథముడు అని అన్నారు. దేశానికి పతకాలు తెచ్చిన రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ విషయం, అదాని వ్యవహారం గురించి ప్రధాని నోరు విప్పాడు అన్నారు. ఇలాంటి ప్రధాని వల్ల మత సామరస్యం పెరగకపోగా మరింత మత విద్వేషం పెరుగుతుందని కావున ఇలాంటి ప్రధానిని ఇంటికి సాగనంపడానికి సీపీఐ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ , యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్, సీపీఐ నాయకులు శ్రీనివాస్, ఇమామ్ ,చంద్రమౌళి, నరేష్ , ఉపేంద్ర , యువజన నాయకులు శ్రీకాంత్, మధు, నాగరాజు, అజరు, ఆశయ్య లు పాల్గొన్నారు.