Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను చర్చలకు ఆహ్వానించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను బెది రించడం, ఉద్యమాన్ని అణిచివేయాలని చూడటం ముఖ్యమంత్రి హౌదాకు సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. వెంటనే వారిని చర్చల కు ఆహ్వానించాలన్నారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నాలుగేండ్లుగా విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు తమను రెగ్యులరైజ్ చేయాలని 14 రోజులుగా 9,355 మంది సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె విరమించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి ఉద్యమాన్ని అణిచివేయడం భావ్యం కాదన్నారు. సమ్మె చేయడం, సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంఘంలోని 19వ ఆర్టికల్ ప్రజలకిచ్చిన ప్రాథమిక హక్కు అనీ, దీన్ని ఏ ప్రభుత్వం , ఏ కోర్టు, ఏ సంస్థ సవాలు చేయడానికి వీల్లేదన్నారు. జూనియర్ పంచాయతీ సెక్రెటరీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనీ, బీసీ/ఎస్సీ/ఎస్టీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు శాసనసభ్యులు పూర్తి మద్దతు ప్రకటించా రు. ఇంతవరకు ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోవడం న్యాయం కాదన్నారు. ప్రతిష్టకు పోకుండా చిరు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, భూపేష్ సాగర్, వేముల రామకృష్ణ, అనంతయ్య, రాజేందర్, కృష్ణ యాదవ్, రామాంజనేయులు, మల్లేష్, నిఖిల్, దీపిక బిల్లా పాల్గొన్నారు.