Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ ఖాజా
నవతెలంగాణ - బాలానగర్
మనిషి ఆరోగ్యాన్ని తనకు తానుగా రక్షించుకోవడం తన బాధ్యతగా గుర్తించినప్పుడు తను చేయాల్సిన కార్యసా ధన ఎంతో దోహదపడుతుందని, అదేవిధంగా మన శరీరా న్ని దృఢంగా, ఆరోగ్యా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో, వ్యాయమం కూడా అంతే ముఖ్యమని బీఆర్ఎస్ బాలానగర్ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ ఖాజా(ఉమర్) అన్నారు. మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్‌నగర్‌లో మహ్మద్ ఖాజా స్వయంగా నిర్వహిస్తున్న బాడీ గ్యారేజ్ జిమ్ మొదటి వార్షికోత్సవ వేడుకలను శనిy ారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి, బాడీ బిల్డింగ్ నిర్వాహకులు ఖాజా మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పౌటీల్లో పాల్గొని జిమ్ కోచ్ ఇనాయత్ ఖాన్ శిక్షణలో పొందుతూ బంగారు, రజత పతకాలను గెలుచుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. మనిషి శరీరం బరువును నియంత్రించడానికి, కండరాలను దఢంగా, శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయ డానికి, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి పెంపొందిం చుకోవడానికి వ్యాయామం తోడ్పడుతుందని మన దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకా యం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాలని కాపాడుకునేందుకు, శారీర దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో పోషక ఆహార పదార్థాలు తీసుకోవడమే కాక వ్యాయామం చేసి శారీరక దఢత్వాన్ని పెంపొందించుకోవాలని ఖాజా కోరారు.