Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులను పీహెచ్డీ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందనీ, అందులో భాగంగానే ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఓయూలో సూపర్వైజర్ అలాట్ చేయకుండా రీసెర్చ్ సెంటర్లలో సూపర్వైజర్ని అలాట్ చేసినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో అలా ట్మెంట్ కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లలో ఎలాంటి అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లకు సూపర్వైజర్ ఇవ్వడం ద్వారా తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రూ.2 వేల నుంచి రూ. 25 వేల పెంచిన పీహెచ్డీ కోర్స్ ఫీజును తగ్గించాలనీ పీహెచ్డీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్, మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను, ప్రొఫెసర్లను, ప్రజాసంఘాల ను, రాజకీయ పార్టీలను కలుపుకుని ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రీసెర్చ్ సెంటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో గైడ్ షిప్ ఆలాట్ చేయాలనీ, అలాట్మెంట్ కాపీలను తగలబెట్టిన ఈ కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ నెల్లిసత్య, ఫిలాసఫీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్, తెలుగు రీసర్చ్ స్కాలర్ బొడ్డుపల్లి అఖిల్, మధు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్ కిరణ్, మహేష్, ఎకనామిక్స్ రీసెర్చ్ స్కాలర్ శ్రీ వాస్తవ, సోషియాలజీ రీసెర్చ్ స్కాలర్ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.