Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రజలు నాలాల్లోగానీ చెరువుల్లో గానీ ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు వేయరాదని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సూచించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో, దోమల నివారణ కోసం ఎంటమాలాజి సిబ్బందితో కలిసి ఎల్లమ్మ చెరువులోని గుర్రపు డెక్కను శనివారం తొలగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి నిల్వలను తనిఖీ చేసి మళ్ళీ నీటిని నింపుకోవాలని సూచించారు. తమ ఇంటితోపాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరి చేరవన్నారు. కాలనీలోకి వచ్చే చెత్త సేకరించే ఆటోలోనే, తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు చేసి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నాయక్, పోశెట్టిగౌడ్, ఎంటమాలాజీ సూపర్వైజర్ డి. నరసింహులు, ఎంటమాలాజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.