Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
పదో తరగతి ఫలితాల్లో బోయినపల్లి సి.యం.ఆర్ హైస్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు. ఏడుగురు విద్యార్థులు వర్షిత, క్రితిహజారే, మనిదీప్, జరు, చక్రవర్తి, ఆదిత్యరాజు, హరిహరన్‌లు జీపీఏ 10/10 సాధించగా, సుమారుగా నలభై శాతం విద్యార్థులు ''ఏ'' గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. 10/10 సాధించిన వారికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యా యులు అహర్నిశలు శ్రమపడి నిర్థిష్టమైన ప్రణాళికతో విద్యార్థులను అడుగడున ప్రోత్సహిస్తూ వారికి నాణ్యతతో కూడిన విద్యా ప్రమాణాలను అందించినందుకు పాఠశాల సిబ్బందిని ప్రశంసించారు. అదేవిధంగా తల్లిదండ్రులు అంతే శ్రద్ధ, పట్టుదలతో టి.వి.లకు, సెల్ఫోన్లకు విద్యా ర్థులను దూరంగా ఉంచి వారిలో 10/10 సాధించాలన్న లక్ష్యాన్ని కల్పించినందుకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ ఎస్.కె.రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.