Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 186, హౌసింగ్ బోర్డ్ స్థలం (ఆర్జీకే) సమీపంలో దాదాపు 6 ఎకరాల పైచిలుకు ప్రభు త్వ భూమిలో 59 జీవో కింద రెగ్యులర్ చేసుకోవడానికి గత రెండు రోజులుగా మట్టి పోసి చదును చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ కోరారు. అలాగే కాలనీ ప్రజల అవసరా లకు ప్రభుత్వ భూమిని ఉపయోగించాలన్నారు. శనివారం ఆ స్థలానికి వెళ్లి పరిశీలించిన ఆయన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేసి రెగ్యులరైజ్ చేయించు కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష పరోక్ష రాజకీయ సహకారం అందిస్తూ మొత్తం భూమిని కొట్టేయడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కార్పొరేటర్ భర్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని , ఇప్పటికే ఈ స్థలంపై బీజేపీ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ పోలీస్ అధికారుల దష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడని ఎడల మంగళవారం ఉదయం బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాలనీ ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కాశి, నిజాంపేట్ కార్పొరేషన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కుంటి రాము, కాలనీ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.