Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. శనివారం బోర్డు సెక్రెటరీ అనితా రామచంద్రన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షను ఆగస్టులో కాకుండా నవంబర్‌లో నిర్వహించాలని కోరారు. రెండు నెలలుగా పేపర్ లీకేజీ అంశం, గ్రూప్-2, గ్రూప్-3, పేపర్-2 పాలిటి, పేపర్-3 ఎకానమీ సిలబస్‌లో 60 నుంచి 70 శాతం వరకు కొత్త అంశాలు చేర్చినట్టు తెలిపారు. పేపర్ లీకేజీ కారణంగా తాము మానసికంగా ఇబ్బంది పడినట్టు తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున పోస్ట్ పోన్ చేయాలని టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెల్లినట్టు తెలిపారు. ఈ అంశం పట్ల బోర్డు సెక్రెటరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. పోస్ట్ పోన్ చేసే దిశగా ప్రయత్నం చేస్తామని హామీనిచ్చినట్టు తెెలిపారు.