Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో శుక్రవారం నుంచి దుబాయ్ సిటీ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకుడు రాబ్సన్ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హౌంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత మర్రి రాజశేర్ రెడ్డి, బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకష్ణ విచ్చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారని తెలి పారు. నేటి నుంచి 50రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. జింఖానా మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల మన్నికైన దుస్తులు, తిను బండా రాలు తక్కువ ధరలకే అందు బాటులో ఉంటాయని తెలిపారు. దుబారు సిటీ ఎలా ఉంటుందో అలాంటి సెట్‌ను తెలంగాణలో మొట్టమొట్టమొదటి సారి ఏర్పా టు చేశామని నిర్వాహ కులు రాబ్సన్ తెలిపారు.ఈ సదవకాశాన్ని జంట నగర వాసులు ఉయోగిం చుకోవలని అయన కోరారు. ఎంట్రీ రుసుము రూ 80 గా నిర్ణయించారు.