Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జి.శంకర్ రాజు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జి.శంకర్ రాజు అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడటం కోసం అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్య బృందంతో కలిసి, బేగంపేట ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్ అధికారులు ఏసీపీ జి.శంకర్ రాజు, సిబ్బంది సీహెచ్ జ్యోతి, ఎస్సై చక్రధర్, చిరంజీవి, ప్రసాద్, ఎస్సార్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్సైలు, సిబ్బంది సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సీపీ ఆర్ చేయు టకు, డాక్టర్లతో కలిసి పోలీసు సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. ప్రతిరోజూ జరిగే ప్రమాదాలపై ఏఈడీ ప్రథమ చికిత్స, ఇతర ప్రాథమిక అత్యవసర చికిత్స లు, ఎలా చేయాలో సిబ్బందికి ,పోలీసులకు నేర్పారు. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ డాక్టర్లు ఎం.శ్రీనివాస్ రెడ్డి, కార్డి యో పల్మనరీ రిససి టేషన్(సి పి ఆర్) పై, హాస్పిటల్ సిబ్బ ందికి, ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. అనంతరం శంకర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పు డు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. హెల్మెట్ ధరించాలన్నారు. వారి ప్రాణాలు వారే కాపాడుకునే విధం గా రోడ్డుపై ప్రయాణాలు చేయాలని సూచించారు. కార్యక్ర మంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.