Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో అబుట్ సోర్సింగ్ కార్మి కులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని ఉస్మానియా యూని వర్సిటీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సంగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ (సీఐటీయూ) అధ్వర్యంలో శుక్రవారం చీఫ్ వార్డెన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ ఓయూలో మెస్, హాస్టల్లలో దాదాపు 382 మంది ఉద్యోగులు సైబెక్స్,సెక్యూర్, బీ సెక్యూర్, వెంక టేశ్వర, ఆయా సంస్థ కాంట్రాక్టర్ ల పరిధిలో పని చేస్తున్నా రని తెలిపారు. వీరికి దాదాపు మూడు నెలల నుంచి సమ యానికి వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. వేతనాలు సమయానికి రాకపోవ టం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. వీరికి వేత నాలు ప్రతి నెలా ఐదో తేదీన లోపల ఇవ్వాలనీ, టెండర్లో ఉన్న కాంట్రాక్టర్లు 20వ తేదీ దాటినా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్లు వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారన్నారు. కాంట్రా క్టర్లతో మాట్లాడి సరైన సమయంలో వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకొవాలని చీఫ్ వార్డె న్ డాక్టర్ జి.శ్రీనివాస రావుని కలిసి మెమొరాండం అందజేశారు. డబ్బులు కోత విధిస్తున్నారనీ, వీరికి ఇప్పటి వరకు ఎలాంటి మెసేజ్ గాని, ప్లే స్లిప్ గాని ఇవ్వలేద న్నారు. కాంట్రాక్టర్లు మోసం చేసినట్టుగా వ్యవహరిస్తున్నా రనీ, వీరితో మాట్లాడి వేతనాలు సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చీఫ్ వార్డెన్ సానూలంగా స్పందించి వేతనాలు సకాలంలో వచ్చే విధంగా చూస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ సీతారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రావు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్, సహాయ కార్యదర్శులు నరేష్, శివ, లక్ష్మణ్, బాలకృష్ణ, మహేందర్, సీహెచ్.మోహన్, రాజు నాయకులు, పాష, అనిల్ కుమార్, మసూద్ అలీ, జంపయ్య, పూల్ సింగ్, సురేష్, పర్శరాం, సుధాకర్, శివ, శౌకథ్ అంజమ్మ, మేఘన, రాణి, పద్మ, యాదమ్మ, రేణుక, నాజియ భేగం, అరుణ, లక్ష్మి, ప్రమీల, అనురాధ, రాధిక, లలిత పాల్గొన్నారు.