Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య
నవతెలంగాణ ముషీరాబాద్
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిన పుస్తకమే హార్ట్ బీట్ పుస్తకమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యువ రచయిత మందుల విప్లవ కుమార్ రచించిన హార్ట్ బీట్ ద సౌండ్ ఆఫ్ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ సభను మోదుకుపోలు సంపాదకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య ,ప్రజాగాయకురాలు విమలక్క, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ తాను కమ్యూనిస్టు మేనిఫెస్టో చదువుతూ ఇంగ్లీషు రాయడం రచనలు చేయడం నేర్చుకున్నానన్నారు. రైటింగ్ ఫ్యాషన్‌గా ఎంచుకున్న వారే మంచి రచయితగా రాణిస్తారని తెలిపారు. సమాజాన్ని చదవకుండా రచయిత కాలేరన్నారు. ఉత్పత్తి, మానవ సంబంధాల మీద రచనలు ఎక్కువగా రావాలని సూచించారు. టీచర్లు ప్రొఫెసర్లు మెసేజ్ స్కాలర్లు పుస్తకాలు చదవడం లేదని.. ఇది సమాజానికి ప్రమాదం అన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ పుస్తక రచయిత సామాజిక ఆర్థిక అంశాల పట్ల నేటి యువతకు ఉపయోగపడే విధంగా అద్భుతమైన వ్యాసాలు రచించారని కొనియాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు న్యాయ వ్యవస్థ పై దాడి ఏ విధంగా జరుగుతుందో పూర్తిగా వివరించినట్టు తెలిపారు. విమలక్క మాట్లాడుతూ పుస్తక రచయిత మానవ మనుగడ ఏ విధంగా ఉండాలనే అంశాలపై చక్కటి వ్యాసాలు రాశారని చెప్పారు. ప్రస్తుత సమాజంలో వాస్తవాలను వక్రీకరించి మేధావులు ఎక్కువగా పుట్టుకొస్తున్నారని, ఈ సమయంలో ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నల్లమల అడవి పై కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలపై తీసుకున్న నిర్ణయాలపై రాసిన వ్యాసాలు కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయని అభివర్ణించారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ పుస్తక రచయిత కమ్యూనిస్టు నేపథ్యంలో వ్యాసాలు రాశారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని రచనలు చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, మాజీ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్, సీనియర్ అడ్వకేట్ చెలకాని వెంకట్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే సలీమా, కలుకూరి రాజు, మూర్తి పాల్గొన్నారు.