Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్నగర్ మేయర్ మేకల కావ్య
నవతెలంగాణ-జవహర్ నగర్
తెలంగాణలో సర్కారు బడులు సర్వంగ సుందరంగా మారుతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యాకు అత్యధిక ప్రాదాన్యతనిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే టాపర్స్ నిలవడం అభినందనీయమని జవహర్నగర్ మేయర్ మేకల కావ్య అన్నారు. గురువారం మన ఊరు... మన బడి పథకంలో భాగంగా రూ. 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాతోపాటు, పౌష్టికాహారం అందజేస్తు న్నారని, గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు కూడా నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చుతున్నారంటే సీఎం కేసీఆర్ విజన్ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లలు దేశ, విదేశాల్లో చదువు తున్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో టాపర్స్ నిలిచిన ఆర్. యశ్వంత్ (9.8జీపీఏ), వి. రవిశంకర్ (9.8 జీపీఏ), ఎస్తర్ రాణి(9.7జీపీఏ)లను సన్మానించి ఒక్కొరికి రూ. 10వేల చొప్పున ముగ్గురికి అందజేశారు. జవహర్ నగర్ పాఠశాలలో 76శాతం, బాలాజీనగర్ పాఠశాలో 60శాతం ఉత్తీ ర్ణత సాధించారన్నారు. కార్పొరేటర్లు గండి రాంచందర్, లావణ్యసతీష్ గౌడ్, కోఆప్షన్సభ్యురాలు శోభారెడ్డి, ప్రభుత్వ పాఠశాల ప్రదానోపాధ్యాయులు శేఖరయ్య, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.