Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెమోరియల్ క్రికెట్ లీగ్ టు క్రికెట్ పోటీలు శనివారం అటహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలను సెంట్రల్ జోన్, రాజేంద్రనగర్ డీసీపీలు వెంకటేశ్వర్లు జగదీశ్వర్ రెడ్డి, చిక్కడపల్లి ఏసీబీ యాదగిరి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమతారెడ్డి టాస్ వేసి మ్యాచులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో దాదాపు 100కు పైగా టీంలు పాల్గొంటారని తెలిపారు. మొదటిరోజు క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ గాంధీనగర్, నల్లకుంట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అజరు 18 బంతుల్లో 65 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. క్రికెట్ లీగ్ మ్యాచుల్లో పాల్గొనే టీమ్‌లకు ప్రత్యేక వసతులతో పాటు గ్రౌండ్లో అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్వహించే క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు కలవ గోపి, నేత శ్రీను, బలకరి రమేష్, సిరిగిరి శ్యామ్, కిరణ్ టక్కరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.