Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జీపీఏ 10/10తో అద్భుత ఫలితాలు సాధించిన గాజులరామారంలోని సీఎం ఆర్ మోడల్ హైస్కూల్ విద్యార్థులు మంత్రి చామకూర మల్లారెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టుదలతో చదివితే ప్రతీ విద్యార్థి అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు, అందుకు నిదర్శనమే సీఎంఆర్ పాఠ శాల విద్యార్థుల ఫలితాలు అన్నారు. పట్టుదలతో చదివి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున నమ్మకని నిలబెట్టాలన్నా రు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులలో ఏం.తేజస్విరెడ్డి జీపీఏ 10/10, సుచిత్ర నాయుడు 10/10, ఎస్.స్ఫూర్తి 10/10 సాధించి గాజుల రామారం డివిజన్లో మొదటి స్థానంలో నిలవగా, టీ.వెంకట సాయి జీపీఏ 9.8 సాధించారన్నారు, ఆరుగురు విద్యార్థులు 9.7, ముగ్గురు విద్యార్థులు 9,5, ఏడుగురు విద్యార్థులు 9.3, నలుగురు విద్యార్థులు 9.2, ఏడుగురు విద్యార్థులు 9.0 పైగా సాధిం చారన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. సీఎంఆర్ హైస్కూ ల్ పాఠశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. తమ పాఠశాల విద్యార్థుల ఇంతటి విజయానికి అధ్యాపకుల కషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదలతో కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరి శంకర్, పాఠశాల ఏఓ సత్తిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.