Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- నాగారం మున్సిపాల్టీలో బస్తీ దవఖానా, మహిళ భవనం, కంటి వెలుగు ప్రారంభం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పేదలందరికి మంచి వైద్యం అందించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని అందులో భాగంగానే పేదలు నివసించే ప్రాంతాల్లో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం నాగారం మున్సిపా ల్టీలో సాధారణ నిధులు రూ. 18 లక్షలతో వార్డ్ నెం.16 రాజ్ సుఖ్ నగర్లో నిర్మించిన బస్తి దవఖానాను, వార్డ్ నెం 12 వేంకటేశ్వర కాలనీలో రూ ,8,50,000/- మహిళా భవనాన్ని, వార్డ్ నెం.15 ఈస్ట్ గాంధీ నగర్లో కంటి వెలుగు కార్యక్రమం మంత్రి ప్రారం భించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు అందు బాటులో వైద్యం అందించేందుకు ప్రభుత్వం బస్తి దవాఖానా లను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, నాగారం మున్సిపల్ చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రారెడ్డి , వైస్ చైర్మెన్ మల్లేశ్ యాదవ్ , కమిషనర్ వాణి రెడ్డి , కీసర మండల వైద్యాధికారి డాక్టర్ సరితా, వివిధ వార్డ్ల కౌన్సిలర్లు, కొ ఆప్షన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రోళ్ల సత్తిరెడ్డి సేవలు మరువలేనివి : మంత్రి మల్లారెడ్డి
పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన గోధుమకుంట మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల సత్తిరెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట ఎర్రోళ్ల సత్తి రెడ్డి 11 వ వర్దంతి సందర్భంగా వారి తనయుడు వంగేటి పర్వత్ రెడ్డి అధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొని ఎర్రోళ్ల సతిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గోధుమ కుంట గ్రామ మాజీ సర్పంచ్ సత్తిరెడ్డి గ్రామ అభివద్ధి కోసం నిరంతరం కషి చేశారని కొనియాడారు. సత్తిరెడ్డి ఆశయాలను ఆయన తనయుడు పర్వత్ రెడ్డి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. యువ కులు క్రీడా పోటీల్లో రాణించి గొప్ప వ్యక్తులుగా ఎదగలన్నారు. క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకా రులకు మంత్రి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ కీసర మండల ఉపాధ్యక్షులు. వంగేటి పర్వతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.