Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 915 సెంటర్లలో 44 రకాల క్రీడలు
- విద్యార్థులతో కిక్కిరిసిపోతున్న జీహెచ్ఎంసీ క్రీడామైదానాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్న మాటలు పదేపదే వినిపిస్తున్నవే. ఇక గ్రామీణ ప్రాంతాలల్లో క్రీడా మైదానా లున్నట్ట హైటెక్ సిటీలో పిల్లలు ఆడుకునేందుకు క్రీడా మైదానాలు దాదాపు అందుబాటులో లేవు. ఈ క్రమంలో నగరంలోని జీహెచ్ ఎంసీ క్రీడా మైదానాలకు నగరవాసుల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది. ఇక సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే చెప్పనక్కర్లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పరుగులు పెడుతున్నారు. దాంతో జీహెచ్ఎంసీ క్రీడా మైదానాలు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆరు సంవత్సరాల నుండి 16 సంవత్సరాల విద్యార్థులు ఆనందో త్సాహాలతో సమ్మర్ కోచింగ్‌లో పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్లే గ్రౌండ్లలో ఘనంగా సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నారు. చార్మినార్ కులి కుతుబ్ షా స్టేడియం, సికింద్రా బాద్ మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్, కుకట్ పల్లి, శేరిలింగంపల్లి చందా నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఎల్.బి.నగర్, ఉప్పల్ స్టేడ ియంతోపాటు ఇతర క్రీడా మైదానాలల్లో విద్యార్థులు పోటాపోటీగా పాల్గొంటున్నారు.
37రోజులపాటు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గత నెల 25న ప్రారంభమైన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ఈ నెల 31వరకు 37 రోజులపాటు కొనసాగ నున్నాయి. దాదాపు 44 రకాల క్రీడలలో 915 సెంటర్లలో ఉదయం 6:15 గంటల నుంచి 8:15 గంటల వరకు శిక్షణ అందిస్తున్నారు.
వందలాది మంది కోచ్‌ల పర్యవేక్షణ
శిక్షణలో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు పిల్లలు పాల్గొంటుండడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు 77 మంది పార్ట్ టైం కోచ్‌లతోపాటు 712 హానర్ రోరియం కోచ్‌లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్, క్రికెట్, బాస్కెట్‌బాల్, స్కేటింగ్, రోలర్, కరాటే, కోకో, జిమ్నాస్టిక్స్, ఉషు, బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, హాకీ, రెజ్లింగ్, థైక్వాండో, హ్యాండ్ బాల్, సపక్ తక్రా, స్కై మార్షల్, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. స్పోర్ట్స్ క్విజ్, ఇంటర్ టోర్నమెంట్ విద్యార్థులకు నిర్వహిస్తారు.
అంబర్‌పేట్‌లో 8 బ్యాచ్‌లు
సికింద్రాబాద్ జోన్ అంబర్ పేట స్విమ్మింగ్ పూల్‌లో ప్రతి రోజు ఉదయం 6:00 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి 7 గంటల వరకు వరకు ఇలా 8 గంటల పాటు నిర్వహిస్తున్నారు. 8 బ్యాచ్‌లు ప్రతీ గంటకు 100 మంది పాల్గొంటున్నారు. ఇదిలావుండగా ఖైరతాబాద్జోన్లోని మెహిదీ పట్నం విజయనగర్ కాలనీ స్విమ్మింగ్ పూల్, కార్వాన్ గోల్కొండ స్విమ్మింగ్ పూల్, సనత్ నగర్ స్విమ్మింగ్ పూల్లలో గంటకు 60 మంది చొప్పున పాల్గొంటున్నారు. ఇక చార్మినార్ జోన్‌లోని మొఘల్ పుర స్విమ్మింగ్ పూల్, చారు లాల్ బరాదారి స్విమ్మింగ్ పూల్లలో గంటకు 100 మంది పాల్గొంటున్నారు. ఎల్బీనగర్ జోన్ వనస్థలిపురం స్విమ్మింగ్ పూల్ (2)లలో గంటకు 50 మంది చొప్పున విద్యార్థులు పాల్గొంటున్నారు. శేర్లింగంపల్లి జోన్ పీ.జే.ఆర్ స్టేడియం చందానగర్‌లో కరాటే శిక్షణకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.