Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
కూకట్ పల్లి నియోజకవర్గంలోని నిరుపేదలకు ఖార్డ్ సంస్థ చేస్తున్న సేవలు హరషణీయమని ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ లోని ఖార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ, ఏఎండీ సంస్థ వారు సంయుక్తంగా మహి ళలకు టైలరింగ్ శిక్షణ ఇప్పించి వారికి సర్టిఫికెట్స్, కుట్టు మిషన్ల ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాలలో వారిని గుర్తించి అవసరమైన నిత్యా వసరాలు అందించడమే కాకుండా వారు స్వయం సమద్ధి సాధించే దిశగా వారికి వత్తి విద్య కోర్సులో శిక్షణ ఇప్పించి సంబం ధించిన ఉద్యోగాలు ఇప్పించి స్వతహాగా వారి కాళ్లపై నిలబడేటట్లు తీర్చిదిద్దడం ఎంతో సంతోషంగా ఉందన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమన్, మం జులత దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఏఎండీ పరిశ్రమ డైరెక్టర్ అనిల్ ను అభినందిస్తూ ఎంతో నిరుద్యోగులకు తమ కంపెనీ ద్వారా ప్రోత్సాహం అందిస్తూ వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొ రేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఖార్డ్ సంస్థ నిర్వాహకులు సుమన్ దంపతులు, ఏఎండీ డైరెక్టర్ అనిల్, డివిజన్ అధ్యక్షులు దర్శనం శాకయ్య తదితరులు పాల్గొన్నారు.