Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
హైదర్ నగర్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు అన్నారు. డివిజన్ పరిధిలోని నాగార్జున హౌమ్స్ లో రూ.35 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో తరితగతిన చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తా మన్నారు. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి, కాలనీ వాసులు వెంకట రత్న కుమార్, రాంబాబు రాజు, డీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.