Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రై కమిషనర్ల సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మూడు కమిషనరేట్ల పరిధిల్లో శాంతిభద్రతలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన, సాధికారత కలిగించే వాతావరణాన్ని సృష్టించడంతోపాటు మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ అధికా రులు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రైసిటీ కమిషనరేట్ పరిధిల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్‌లోని టీఎస్పీఐ సీసీసీలోని 17వ అంతస్తులో హైలెవల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. శనివారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, ఉమెన్ సేఫ్టీ అదనపు డీజీ శిఖా గోయెల్ పాల్గొన్నారు. ముఖ్యంగా మహి ళలకు, చిన్నారుల రక్షణకు కావాల్సిన వివిధ అంశాలపై చర్చించారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లను మెరుగుపర్చడం, సీసీ కెమెరాల పనితీరు, డయాల్ 100కు ప్రాధాన్యతపై చర్చిం చారు. మూడు కమిషనరేట్ల పరిధిలోవున్న భరోసా సెంటర్ల భవనాల ప్రస్తుత పరిస్థితితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే భరోసా కేంద్రాలపై ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో షీ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్థలాల సేకరణపై చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జీ.సుధీర్‌బాబుతోపాటు జీహెచ్ఎంసీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు.