Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ పరిధిలో తెలంగాణ కుకింగ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ అల్వాల్ హెచ్.పి గ్యాస్ గోడౌన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బిల్లింగ్పైన ఉన్న డెలివరీ ఛార్జీలను వీరికి అందజేయాలని, సరైన న్యాయం చేయాలంటూ యాజమాన్యం గత నెల రోజుల నుండి వారి దష్టికి తెచ్చినా స్పందించటం లేదని వారు వాపోయారు. గ్యాస్ సరఫరా వాహ నాలు మంచి చెడులు కూడా వారికి సంబంధం లేకుండా నేను చూసుకుంటా 50 కుటుంబాలు రోడ్డున పడతాయని వేరే పనిచేయలేకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని, పరిస్థితి అర్థం చేసుకొని సహకరించాలని వారు కోరారు. లాక్డౌన్ ఉన్న పరిస్థి తులలో కూడా మా కర్తవ్యం నిర్వహించామని, గత నెలలో 16000 సిలిండర్లు అందజేశామని తెలియ పరిచారు.
గ్యాస్ వాహనాలను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటనివారు ఆందోళన చెందారు. ఈ కార్యక్ర మంలో యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, సెక్రటరి వేణు నరేందర్, వినరు భాస్కర్ సత్తి భరణి శేఖర్ రఘు బిక్షపతి మోసిన్ శివ దీపక్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.