Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
వరల్డ్ అసోసియేషన్ ఫర్ బ్రోన్కాలజీ అండ్ ఇంటర్నేషనల్ పల్మోనాలజీ (డబ్ల్యూఏబీఐపీ) నిర్వహించిన 'బెస్ట్ ఇమేజ్ కాంటెస్ట్ 2021' పోటీలో యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్కు చెందిన డాక్టర్ హరి కిషన్ గోనుగుంట్ల నేతత్వంలోని ఇంటర్నేషనల్ పల్మోనాలజీ వైద్య బందానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. డాక్టర్. హరి కిషన్ యూరోపియన్ అసోసియేషన్ ఫర్ బ్రోన్కాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీలో భారతదేశం నుంచి జాతీయ ప్రతినిధిగా నియమితులవడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి అన్నారు. డబ్ల్యూఏబీఐపీప్రతిష్టాత్మకంగా ప్రతీ సంవత్సరం నిర్వహించే 'బెస్ట్ ఇమేజ్ కాంటెస్ట్' లో తమ హాస్పిటల్ బృందం రెండు అవార్డులను గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా డాక్టర్. హరి కిషన్ నేతృత్వంలోని వైద్య బందం సభ్యులు డాక్టర్ సమియా రషీద్, డాక్టర్ వరుణ్ కందుకూరి, డాక్టర్ వరుణ్ ఎండి, డాక్టర్ తియాగేశ్, గణపతికి అభినందనలు తెలిపారు.