Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్, కేయస్ గ్రామర్ స్కూల్ లైన్లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ రూ.18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గాయత్రీ నగర్లో సీసీ రోడ్డు ప్రారంభిం చడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పటికే పలు బస్తీల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల స్థానంలో నాణ్యతతో కూడిన సీసీ రోడ్లు వేయడం జరిగిందని, మన డివిజన్‌ను ఇంతగా అభివద్ధి చేయగలుగుతున్నామంటే కారణం ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు సహాయ సహకారాలతో సాధ్యం చేయగలిగామని అన్నారు. అలాగే డివిజన్‌ను మరింత అభివద్ధి పధంలోకి నడిపించి ముందుకు తీసుకెళతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, రాములు, రఫిక్, టీవీఎస్ రాజు, యూసుఫ్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, సంపత్‌రెడ్డి, బాబా షరీఫ్, జ్ఞానేశ్వర్, ఇస్మాయిల్, పార్వతమ్మ, రేవతి, లక్ష్మి, వాణి, తాజ్ బి, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.