Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యర్ధాలు, చెత్తాచెదారం వేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలి : సింగూరు పాండు
- కూకట్పల్లి ట్రక్ పార్కింగ్ స్థలాన్ని డంపింగ్ యార్డ్‌గా మారుస్తున్నా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కూకట్పల్లి
మెట్రో క్యాష్ యన్ క్యారీ వెనుక ఖాళీ స్థలంలో, కుకట్పల్లి సంగీత్‌నగర్ ప్రాంత పరిధిలోని 9 కాలనీవాసులకు ఉపయోగకరంగా ఉండేందుకు, ఉదయం, సాయంత్రం యువత క్రీడా మైదానంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ మైదానం మొత్తాన్ని భవన నిర్మాణ వ్యర్ధాలతో, చెత్తా చెదారంతో నింపుతూ డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తున్నారని స్థానిక దళిత ఐక్యవేదిక అధ్యక్షులు సింగూరు పాండు, అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. భవన నిర్మాణదారులు, భవన నిర్మాణాల్లో వచ్చే వ్యర్ధాలను రాత్రికి రాత్రి ఆ మైదానంలో వేసి పూర్తిగా అపరిశుభ్రంగా మారుస్తు న్నారని, అలాగే ఇతర ప్రాంతాల నుండి తెచ్చే చెత్త ఇక్కడ తగలబెట్టి వాతావరణ కాలుష్యాన్ని చేస్తూ, స్థానికులను అనారోగ్యాలకు గురయ్యేలా చేస్తున్నారని, ఈ సమస్యపై గతంలో జీహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజల సమస్యలు అర్ధం చేసుకుని, ఇక్కడ భవన నిర్మాణ వ్యర్ధాలు, చెత్త చెదారం వేయకుండా చర్యలు చేపట్టాలని అధికారు లను కోరుతున్నామని స్థానిక దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు సింగూరు పాండు, స్థానిక ప్రజలు తెలియజేవారు.