Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బేగంపేట్
అగ్నిప్రమాదాలు సంభవించి నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ కష్ణ మోహన్‌రావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ పరిశ్రమలు, విద్యుత్ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని ఆయన పేర్కొన్నారు
షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ ప్రమాదాలు :
వారంలో ఎక్కువసార్లు మాల్స్, మల్టీ ప్లెక్స్లలోనే గడుపుతుంటాను ఒక విజిటర్‌గా చెపుతున్నాను వేసవి అగ్ని ప్రమాదాలకు అసలైన కాలం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మాల్స్ అయితే.. ప్రతి ఫ్లోర్లో అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ అందు బాటులో ఉండాలి. ప్రమాదాల నుంచి తప్పించుకునే ఎమర్జెన్సీ మార్తాలను అందుబాటులో ఉంచాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఫైర్ ఎగ్జిట్ మార్గా లను సూచించే బోర్డులు పెట్టాలి. ప్రమాదాల నుండి కాపాడేందుకు తగిన శిక్షణ పొందిన సెక్యూరిటీ స్టాఫ్ కలిగి ఉండాలి. సూపర్వైైజర్స్, ఫైర్ ఆఫీసర్ ప్రతి చోటా ఉండాలి. విద్యుత్‌తో పనిలేని మెర్క్వూరీ సైన్ ఎగ్జిట్ బోర్డ్ ఉండాలి. ప్రతి 3 నెలలకు మాక్ఫైర్ డ్రిల్ నిర్వహించాలి. వీటితోపాటు పౌరుడిగా మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదం జరిగినపుడు లిఫ్ట్‌లు ఎస్కలేటర్ ఉపయోగించదారు. ఎక్కడైనా నిప్పు, పొగను గమనించితే సెక్యూరిటీ మేనేజ్మెంటుకు తెలియచేయాలి. ఫైర్ అలారం అందరికీ వినిపించాలి. తోటివారికి తగిన సహాయం చేసి ఎగ్జిట్ మార్గాల ద్వారా బయటపడాలి. అగ్ని ప్రమాదం జరిగితే 101కు వెంటనే కాల్ చెయ్యాలని, వెంటనే స్పందించి ప్రమాదం నివారించగలమన్నారు.