Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
చర్లపల్లి భగవాన్ కాలనీవాసులు గత కొంత కాలంగా పడుతున్న మురుగు కష్టాలపై పరిష్కారం చూపాలని కోరుతూ చర్లపల్లి కాలనీల సమాఖ్య చేసిన విజ్ఞాపనపై నవ తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలకు కాప్రా సర్కిల్ యంత్రాంగం ఎట్టకేలకు స్పందించి బుధవారం క్షేత్రస్థాయిలో బకెట్ క్లీనింగ్ పనులకు ఉపక్రమించింది. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఇంజనీరింగ్ అధికారులు ఈఈ కోటేశ్వరరావు, డీఈ బాలకష్ణ ఏఈ సత్య లక్ష్మి స్పందించారు. భగవాన్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలలో పేరుకు పోయిన మురుగు పూడికను పూర్తిస్థాయిలో తొలగించేందుకు కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన యంత్రాలను తెప్పించి బకెట్ క్లీనింగ్ పనులను చేపట్టారు. కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.