Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఘట్కేసర్లోని జెకె కన్వెషన్ హాల్లో షెడ్యూల్డ్ కులా లు, పేద మహిళలు, రైతులకు మర్రి రాజశేఖర్‌రెడ్డి సౌజన్యతో నూనె తయారీ పరికరాలు, వ్యవసాయ ఉపకరణాలు, చెరుకురసం తయారీ యంత్రాలు, రూ.42 లక్షల వ్యయం తో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశా లలో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి సహ కారంతో తయారు చేసిన ఈ ఉపకరణాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మలారెడ్డితో మర్రి రాజశేఖర్‌రెడ్డి లబ్ది దారులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తన కళాశాల మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికంగా వెను కబడిన రైతుల సక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గొప్ప ప్రయ త్నం చేస్తున్నారని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలి పారు. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోకవర్గ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె సీమలే ప్రగ తికి పట్టుకొమ్మలు అనే మహాత్మాగాంధీ వచనాలను నేడు సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఅర్ ప్రత్యేక దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిం చడం మన కండ్ల ముందు సాక్షాత్కరింప బడుతోంద న్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో జల కల ఉట్టిపడుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకూ జరగని ప్రగతిని సాధించింది తెలంగాణ అన్నారు. రైతు బంధు దేశంలోనే మొట్టమొదట వినూత్న పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేసి సీఎం కేసీఆర్ రైతుల ఆత్మబంధవు అయ్యారనీ, అలాంటి మన ప్రగతిశీల నాయకులైన కేసీఆ ర్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజ వికాసానికి తన వంతుగా సామాజ సంక్షేమానికి ఒక ప్రయత్నం చేయాలని సంక ల్పించి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల స్వయం స్వావలంబనే ధ్యేయంగా వారికి ఉపకరణా లను తమ ఇంజినీరింగ్ కళాశాల మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో రూ.42 లక్షల వ్యయ ంతో తమ కళాశాలలో రూపొందించిన వివిధ ఉపకరణా లను పంపిణీ చేశామన్నారు. ఈ ఉపకరణాల్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పవర్ టిల్లర్, పురుగు మం దులు పిచికారీ చేసే యంత్రం, వేరుశనగ నూనె తయారు చేసే యంత్రం, చెరుకు రసాన్ని తీయు పరికరం ఉన్నట్టు తెలిపారు. రైతులు, వివిధ ఉపాధి అవకాశాలు మెరుగుప రచడానికి నిరుద్యోగ యువతకు వీటిని అందించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజల తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి రేటు నమోదు అవు తుందనీ, ఈ సందర్భంగా సుమారు 2 వేల మంది ఈ ఉపకరణాల వల్ల ఉపాధి పొందుతారని తెలిపారు.
గతంలో పలు సేవా కార్యక్రమాలు
గతంలో మేడ్చల్ జిల్లాలో పలు సాంఘిక సేవా కార్య క్రమాలను నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల్లో బెంచీలు, కంప్యూటర్ల పంపిణీ, విద్యా రథులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం వంటివి చేశారు. భవిష్యత్‌లో మరో మూడు మం డలాలకు చెందిన వారికి కూడా ఉపకరణాలు అందజేయ నున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ప్రి న్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఎంఎల్ఆర్ఐటీ ప్రాజెక్టు ఇన్చార్జి డాక్టర్ గుప్తా, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఘట్కేసీఆర్ మండలంలోని సర్పంచులు, పీఏసీఎస్ చైర్మెన్లు, మేడ్చల్ మున్సిపాల్టీ వైస్ చైర్మెన్ చెర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.