Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజీగూడ కొర్పొరేటర్ రమేశ్‌గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందడంతో తిరిగి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. బుధవారం లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు ముద్ర బోయిన శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పలు కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యు లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయా లన్నారు. ప్రతి ఒక్కరూ దాదాపు మూడు సార్లు గడప గడపకూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్ర మాలు వివరించాలని సూచించారు. గతేడాది కరోనా, భారీ వర్షాల కారణంగా అభివృద్ధిలో కొంతమేర జాప్యం జరిగిందని తెలిపారు. గత ఐదేండ్లుగా లింగోజీగూడ డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో లింగోజిగూడ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీని చ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిలక్‌రావు, నర్రె శ్రీనివాస్, ఆడాల రమేష్, ప్రేంనాధ్ గౌడ్, భాస్కర్ గంగపుత్ర, వరప్రసాద్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, నరసింహగుప్తా, శ్రావణ్ కుమార్, మధు సాగర్, ప్రవీణ్‌రెడ్డి, రాజుగౌడ్, ఇంద్రాజీ, దుర్గలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.