Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్దులపై సందేహాలెన్నో
- మేయర్‌ను నిలదీసిన అధికార పార్టీ కార్పొరేటర్లు
- కన్నీళ్లు పెట్టుకున్న మేయర్
- బడ్జెట్ ఆమోదించకుండానే సమావేశం వాయిదా
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడ్జెట్ ఆమోదానికి అధికార పార్టీ కార్పొరే టర్లే అడ్డంకిగా మారారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ సమావేశాలు బుధవా రం వాడి వేడిగా కొనసాగాయి. వార్షిక బడ్జెట్ రూ.35.05 కోట్లుగా అధికారులు అంచనా వేశా రు. గతేడాది వార్షిక బడ్జెట్ రూ.48.76 కోట్లు ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం స్టాంపు డ్యూటీ (రిజిస్ట్రేషన్ చార్జీలు) డైరెక్ట్‌గా ప్రభుత్వ ఖాతా లోకి వెళ్తుండటంతో బడ్జెట్ ఆదాయ వ్యయాలు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్లే అడ్డంకి
బడ్జెట్ గతేడాదికంటే తగ్గిందనీ, ఆదాయ వ్యయాలు తప్పుల తడకగా ఉన్నాయని అధికార టీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ (మేయర్ కూడా టీఆర్ఎస్ తరపున ఎన్నికైనవారే) సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కార్పొరేషన్‌పై కనీస అవగాహన లేకుండా మేయర్ వ్యవహరించడం సరికాదన్నారు. దానికితోడు మేయర్ భర్త స్వ యంగా మున్సిపల్ కార్యాలయంలోనే ఆఫీసు పెట్టుకుని ఉండటం సరికాదని మేయర్‌తో వాది ంచినట్టు సమాచారం. తమ ప్రమేయం లేకుం డా అధికారులు, మేయర్ తమకు ఇష్టం వచ్చిన ట్టు బడ్జెట్ అంచనాలు వేసుకున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్‌ను నిలదీ శారు. దీంతో మేయర్ తనకేం తెలియదనీ, తానొ క సాధారణ గృహిణి అనీ, రాజకీయం తెలి యదని కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లే తమ పార్టీ మేయర్‌పై ఇలాంటి ఆరో పణలు చేస్తే ఇక ప్రతిపక్ష పార్టీల సభ్యులు చేయ కుండా ఉండగలరా అని సర్వత్రా చర్చించుకుం టున్నారు. మేయర్ భర్త ఎవరినీ పట్టించుకో కుండా, ఒంటెద్దు పోకడలతోనే ఇలా జరుగుతుం దనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మేయర్, ఆమె భర్త అందరినీ కలుపుకుని కార్పొ రషన్ అభివృద్ధి కోసం పని చేయాలని కార్పొ రషన్ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు కోరుకుంటున్నారు.