Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో అశాస్త్రీయం గా రాష్ట్రంలో రైతుల భూములను రాష్ట్ర సర్కార్ స్వాహా చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధ వారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వం వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో వేల ఎకరాల రైతు భూములను స్వాధీన పర్చుకుని తమ అనుచరులను ఆర్థికంగా అందలమెక్కించడంలో పూర్తిగా నిమగమైనట్టు ఇటీవల కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో స్పష్ట మవుతుందని పేర్కొన్నారు. గత ఏడేండ్లుగా వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూమితో ఉపాధి కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చోద్యం చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ జోన్లో 90 మంది సీఐలకు డీఎస్పీగా పదోన్నతిని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిపా దించిన పీఆర్సీపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగస్తుల జీతభత్యాల వ్యత్యాసాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రయివేటు ఉపాధ్యాయులు, ఉద్యోగ స్తులు కరోనా తాకిడితో తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతు న్నారనీ, ప్రభుత్వం త్వరలో నిరుద్యోగ భృతిని విడుదల చేయానీ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేసి సంబంధిత ప్రభుత్వ ఉద్యో గాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.