Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నాడని ఆరోపణ
నవతెలంగాణ-ఓయూ
మాస్క్ ధరించకుండా వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుపై చర్యలు తీసుకోవాలని మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల.సారంగపాణి డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాస్కు ధరించకుండా విచ్చలవిడిగా పబ్లిక్‌లో తిరుగుతూ ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘిస్తున్న పద్మారావుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసంఘటనపై విచారణ జరిపి ఆయనపై తగిన ఛలాన్ విధించి పోలీసులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.