Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డికి వినతి
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఉన్న చిన్న చెరువు, ఎర్రమల్లేవాగు, పుల్చేరుకుంట, రాయికుంట చెరువులోకి మురుగునీరు చేరకుండా వాటిని కాపాడాలని మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్ కోరారు. ఈమేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైస్చైర్మెన్ పలుగుల మాధవ్రెడ్డితో కలిసి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్లోకి మురుగునీరు చేరి కలుషితమవుతున్నాయని, దీనివల్ల సమీపంలో ఉన్న కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సివరేజ్లైన్ను డ్రెయినేజీలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కడుపోల్ల మల్లేష్, కుతాడి రవీందర్, మాజీ వార్డు సభ్యుడు బర్ల దేవేందర్ ముదిరాజ్, శివరాత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు.