Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
పర్సనల్ కేర్ బ్రాండ్ అయిన సెబామెడ్ తన సిర్పూసైన్స్ కు సునో క్యాంపెయిన్ ద్వారా హెయిర్ బ్రేకేజ్, హెయిర్ లాస్ లకు మధ్య తేడాను తెలియజేస్తూ శిరోజాల సంరక్షణ విధానాలను సవాల్ చేస్తున్నట్లు సెబామెడ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ కోణార్క్ గౌర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాంటీ హెయిర్ లాస్ షాంపూను ప్రధానంగా చేసుకుని రూపొందించారన్నారు. ఈక్యాంపెయిన్లో ఈ బ్రాండ్ హెయిర్ లాస్ గురించి వినియోగదారులకు సరికొత్త అంశాలను తెలియజేస్తుందని, పటిష్టమైన శాస్త్రీయ పరిశోధన దన్ను ఉన్న పరిష్కారాన్ని ఎంచుకోవాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తుందన్నారు. యాంటీ హెయిర్ లాస్ షాంపూకు అదనంగా చుండ్రు, శిరోజాల రోజువారీ నిర్వహణ కోసం ఇతర ఉత్పాదనలను తన యాంటీ డాండ్రఫ్, ఎవ్రీడే షాంపూ శ్రేణిలో అందిస్తుందన్నారు. సెబామెడ్ యాంటీ హెయిర్ లాస్ షాంపూ ఓ వినూత్న ఉత్పాదన, కిక్కిరిసిపోయిన షాంపూ విభాగంలో తాము సంచలనం సృష్టిస్తామని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.