Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు టీయూటీఎఫ్ వినతి
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల్లో హెచ్ఆర్ఏ రేట్లు తగ్గించకుండా అమలు చేయాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జె.కైలాసం కోరారు. ఈమేరకు బుధవారం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కైలాసం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో అగ్రభాగాన ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం 11వ వేతన సవరణ సిఫార్సు అమలు చేయడం ఆనందకరమైన అంశమని, అయితే దీంట్లో హెచ్ఆర్ఏ రేట్లు 24, 17, 13, 11 శాతంగా తగ్గించడంతో ఉద్యోగ వర్గం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పైసమస్యలను దృష్టిలో ఉంచుకుని హెచ్ఆర్ఏ రేట్లు తగ్గించకుండా పాత శ్లాబ్ లనే అమలు చేయాలని కోరారు. 2019 నుంచి 2021 వరకు పీఆర్సీ చెల్లించేలా చొరువ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.