Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 బీసీ సంఘాల డిమాండ్
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్లను వెంటనే ప్రారంభించాలని 14 బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈమేరకు బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కరోనా సాకుచూపుతూ విద్యాసంస్థలను మూసివేస్తే విద్యార్థుల చదువు దెబ్బతింటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలు నడుస్తున్నాయని, అలాంటప్పుడు తెలంగాణలో కూడా నడపడానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చేసే అవకాశమున్న సినిమా, ఫంక్షన్ హాళ్లు, బార్లు, వైన్స్ మూసి వేయకుండా విద్యా సంస్థలను మూసివేయడం తగదన్నారు. ఏప్రిల్ 10 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో రాజేందర్, జిల్లపల్లి అంజి, ఉదరు, జయంతి, చంద్రశేఖర్, స్వప్న, లోకేష్, మనోహర్, బైరు మనికంట గౌడ్ పాల్గొన్నారు.