Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం గాజులరామారం ప్రాంతానికి చెందిన గురుప్రీత్‌సింగ్ అలియాస్ సోనుసింగ్ (30) పాలీసింగ్ పనులు చేస్తుంటాడు. అతని తండ్రి కలవెందర్సింగ్ (75) పంజాబి డాబాను నడుపుతున్నాడు. అయితే కరోనా కారణంగా సంవత్సరం కాలంగా వ్యాపారం సరిగా నడవకపోగా, పాలీసింగ్ పనులు లేని సమయంలో డబ్బు సంపాదించాలని 2020 అక్టోబర్‌లో మహరాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి డాబాలో ఉంచి విక్రయించే వారు. అతని తండ్రి కలవెందర్సింగ్ 100 గ్రాముల ప్యాక్‌లను తయారు చేసి విక్రయించే వారు. నెల రోజుల క్రితం నాందేడ్ నుంచి రూ.15 వేలకు 3కిలోల గంజాయిని కొనుగోలు చేసి నిరుపేదలకు విక్రయించే వారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాబాపై దాడి చేసి వారి వద్ద నుంచి రూ.10 వేలు విలువైన 2.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.