Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చంద్రాయణగుట్ట
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి న్యూఢిల్లీ లో జరిగే 2021 జాతీయ సబ్ జూనియర్ రెజ్లింగ్ (కుస్తీ) ఛాంపి యన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక య్యారు. గొల్లకిడికిలోని జైభవాని వ్యాయామశాల జాతీయ పోటీలకు ఎంపికైన మల్లయోధులకు అభి నందనలు తెలిపిన అర్జున్ యాదవ్ పహిల్వాన్ నిర్వా హకులు అర్జున్ యాదవ్ పహిల్వాన్ మార్గనిర్దేశనంలో శిక్షణ పొంది రాటుదేలిన పి.కుశల్యాదవ్ (55కెజ్)లు, పి.నిబిల్ యాదవ్ (60 కేజీలు) కె. శశంక్ యాదవ్ (65 కేజీల విభాగాల్లో ఎంపికయ్యారని ఆర్జున్ యాదవ్ వెల్లడించారు. వీరితోపాటు తెలంగాణ వివిధ ప్రాంతా లకు చెందిన పలువురు మల్లయోదులు దేశ రాజధానిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని అయన వివరించారు. ఇప్పటికే వ్యాయామశాలలో తర్ఫీదు పొందిన కుస్తీ క్రీడాకారులు జాతీయ. రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటా రని, ఇది తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమ వ్యాయామశాలలో శిక్షణ పొందిన ముగ్గురు మల్లయోదులు తప్పనిసరిగా రాంపియన్లుగా నిలుస్తారని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలియజేశారు.