Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ఓ వ్యక్తిని కత్తితో గాయపరిచిన నలుగురిని బుధవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎల్లమ్మబండ పీజేఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న కె.అర్జున్ (34) ఆటో డ్రైవర్‌గా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి తన ఆటోలో కేపీహెచ్‌బీ నుంచి ఎల్లమ్మ బండకు వెళ్తుండగా గుడ్‌విల్ హోటల్‌కు రాగానే పీజేఆర్నగర్కు చెందిన చింత రవి ఆటోలో ఎక్కాడు. పీజేఆర్‌నగర్ చౌరస్తాకు చేరుకున్న అనంతరం ఆటో దిగుతున్న రవిని నలుగురు వ్యక్తులు వీరబాబు, ఎం.మధవన్ అలియాస్ సన్నీ, ఉమర్ అలీ, ఎ.తేజారెడ్డిలు అతనిపై దాడి చేశారు. దీంతో అర్జున్ కలగచేసుకుని ఎందుకు కొడుతున్నారని అడగడంతో అర్జున్‌పై దాడి చేసి అతని తుంటి వెనుక భాగంలో చిన్న కత్తితో పొడిచి గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.