Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్థిక సంవత్సరం బుధవారంతో ముగియనుండడంతో ఆస్తిపన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది.2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1900 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1800 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే రూ.1,357.12 కోట్లు వసూలైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గతేడాది కంటే రూ.100కోట్లు పెంచి రూ.1900కోట్లుగా నిర్ధేశించారు. అయితే బుధవారం రాత్రి 9 గంటల వరకు రూ.1,621.70 కోట్లు వసూలైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 15 లక్షలకుపైగా ఉన్న అసెస్మెంట్ల ద్వారా రూ.12,16,116 లక్షల ఆస్తిపన్ను వచ్చింది. బుధవారం రాత్రి వరకు గడువు ఉండడంతో మరింత పెరిగే అవకాశం ఉందిని అధికారులు చెబుతున్నారు.