Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
చంపాపేట్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో గుర్రం సుధాకర్‌రెడ్డి విజయం సాదించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో గుర్రం సుధాకర్రెడ్డిప్యానల్ పై ఆయనతో పాటు పోటీ చేసిన వారందరూ విజయం సాధించారు. మునుగాల జైహింద్ రెడ్డి ప్యానల్ పై పోటిచేసినవారు ఓటమి పాలయ్యారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన మునుగాల జైంహింద్ రెడ్డి పై, గుర్రం సుధాకర్ రెడ్డి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములు సాదారనమే అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మల్రెడ్డి ముకుందరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లబోలు చంద్రపాల్ రెడ్డి సంయుక్త కార్యదర్శి చింతల చంద్ర శేఖర్ రెడ్డి, కోశాధికారి కేతిరెడ్డి సురంజన్ రెడ్డి, కాలనీ మాజి అద్యక్షుడు నల్ల క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.