Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చేందుకు కృషి
- కబడ్డీ టోర్నమెంట్ ముగింపు సభలో మంత్రులు ఈటల రాజేందర్, చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రతి నియోజకవర్గానికో క్రీడా స్టేడియం ఏర్పాటుకు చేసేలా చర్యలు తీసుకుంటామని, తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రులు ఈటల రాజేందర్, చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని వైష్ణవి అకాడమీలో నాలుగు రోజులుగా టీఆర్ఎస్ బోడుప్పల్ మాజీ అధ్యక్షుడు చెర్ల ఆంజనేయులు యాదవ్ స్మారకార్థం నిర్వహిస్తున్న అంతర్ జిల్లా పురుషులు, మహిళల కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దశల వారీగా అభివద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ నేతత్వంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. సంప్రదాయ క్రీడగా పేరొందిన కబడ్డీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కషి చేస్తున్న కబడ్డీ అసోసియేషన్ వారిని అభినందించారు. అనంతరం విజేతలైన ఆటగాళ్లకు ట్రోఫీ అందచేశారు.టీఆర్ఎస్ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణకు ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దీనిద్వారా బోడుప్పల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జాతీయ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు కాసాని వీరేశం, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖరరెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్, ఘటకేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి,బోడుప్పల్ కార్పొరేషన్ కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నేతలు, యువజన విభాగం నాయకులు, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్ జిల్లా పురుషుల కబడ్డీ జట్టు విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది.