Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
గుడ్ ఫ్రైడే సంబురాలు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని షరోన్ గాస్పల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ అబ్రహం, చర్చి ఫాదర్ ప్రభుదాస్, రోడ్ నెంబర్9లోని సెంట్రల్ పవర్ చర్చి ఫాదర్ తుమ్మా హరిలా భక్తులనుద్దేశించి ప్రసంగించారు. యేసు మాటల్లో ఉన్న ఆధ్యాత్మికతను భక్తులకు బోధించారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది భక్తులను చర్చిలోకి అనుమతించి భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొనేలా చర్చి కమిటీ చర్యలు తీసుకుంది. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.